సిరా న్యూస్,బాసర;
బాసర ఆర్జీయూకేటీ ఇన్ఛార్జి ఉపకులపతి పై పలు ఆరోపణలతో కూడిన కరపత్రం గురువారం ఉస్మా నియా యూనివర్సిటీ జేఎసీ పేరిట విడుదలవడం కలకలం సృష్టిం చింది…ఆ కరపత్రం పలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ తో పాటు ఆర్జీయూకేటీ ఉపకులపతిగా కొనసాగుతూ, పేద విద్యార్థులకు చెందాల్సిన డబ్బులు కాజేస్తూ ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేశాడని ఆ కరపత్రం లో ఆరోపించారు. హైదరాబాద్లోని కార్యాలయంలో ప్రైవేటు వ్యక్తులను నియమించుకొని, ట్రిపుల్ ఐటీ ఉద్యోగులుగా రూ.లక్షల జీతం ఇస్తూ ఆక్రమాలకు తెరలేపారన్నారు. ఆర్జీయూకేటీలో విద్యార్థులు, మహిళా ఉద్యోగులను వేధించడం, అప్పుడ ప్పుడూ ఇక్కడికి వస్తూ విశ్వవిద్యాలయానికి సంబంధించిన డబ్బులు దండుకున్నాడన్నారు… చేయని పనులకు నకిలీ బిల్లులు సృష్టించి, భోజ నశాలల నిర్వాహకుల వద్ద డబ్బులు వసూలు చేశాడని ఆరోపించారు. ఈ విషయంపై ‘ ఆర్జీయూకేటీ ఉపకులపతిని చరవాణిలో సంప్రదించాలని ప్రయత్నించగా ఆయన అందుబాటులో లేరు…..