సమస్యలు పరిష్కరిస్తామని మంత్రి హామీ
సిరా న్యూస్,అమరావతిః
రాష్ట్రవ్యాప్తంగా వివిధ వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించి, వారికి అన్ని విధాల అండగా నిలుస్తామని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ హామీ ఇచ్చారు. ఉండవల్లిలోని నివాసంలో మంత్రి నారా లోకేష్ 40వ రోజు ప్రజాదర్బార్ కు రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు తరలివచ్చారు. మంత్రిని స్వయంగా కలిసి తమ సమస్యలు విన్నవించారు. ప్రతి ఒక్కరి విజ్ఞప్తిని పరిశీలించిన మంత్రి.. ఆయా సమస్యల త్వరితగతిన పరిష్కారానికి కృషిచేస్తామని హామీ ఇచ్చారు.