గుడివాడ అభివృద్ధి…. ప్రజా సమస్యల పరిష్కారానికై….ఇప్పటికి 9సార్లు సీఎం చంద్రబాబును కలిశాను

ఎమ్మెల్యే వెనిగండ్ల రాము

సిరా న్యూస్,గుడివాడ;
రాబోవు ఐదేళ్లలో గుడివాడ నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి స్వచ్ఛమైన త్రాగునీరు అందిస్తూ…. రోడ్లు, డ్రైనేజీ వసతులను పూర్తిస్థాయిలో కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తున్నానని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు.గుడివాడ రూరల్ మండలం దొండపాడు గ్రామంలో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఆధ్వర్యంలో ప్రజా వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. తొలుత గ్రామ సెంటర్లో ఎమ్మెల్యే రాముకు…. టిడిపి శ్రేణులు, గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. అనంతరం సెంటర్లో టిడిపి జెండాను ఎగరవేసిన ఎమ్మెల్యే రాము ప్రజా వేదికలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము ప్రజలతో స్వయంగా మాట్లాడుతూ…. వారి వద్ద నుండి వినతుల అర్జీలను స్వీకరించారు.ప్రజా వేదికలో పాల్గొన్న అధికారులతో మాట్లాడిన ఎమ్మెల్యే రాము….. పలు సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవడంతో హర్షం వ్యక్తం చేస్తు అర్జీదారులు ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలుపుతున్నారు.

ఈ సందర్భంగా జరిగిన సభలో ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ….. గుడివాడ నియోజకవర్గ అభివృద్ధి మరియు ప్రజా సమస్యలపై…. ఇప్పటికి 9సార్లు సీఎం చంద్రబాబును కలిసినట్లు ఎమ్మెల్యే రాము తెలియచేశారు. గుడివాడ అభివృద్ధికి సీఎం చంద్రబాబు సానుకూలంగా ఉన్నారని ఆయన వెల్లడించారు.నియోజకవర్గంలోనీ ప్రతి గ్రామంలో…. ప్రతి ఇంటికి స్వయంగా తిరిగిన తనకు ప్రజల సమస్యలపై పూర్తి అవగాహన ఉందని ఎమ్మెల్యే రాము పేర్కొన్నారు. గ్రామాల అభివృద్ధికి ప్రణాళిక బద్ధంగా చర్యలు తీసుకుంటున్నామని ఆయన అన్నారు.

సూపర్ 6 పథకాల అమలతో పాటుగా….. రాష్ట్ర అభివృద్ధి…. ప్రజల శ్రేయస్సుకు సీఎం చంద్రబాబు నాయకత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేస్తుందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము అన్నారు.ప్రజా వేదిక కార్యక్రమంలో గుడివాడ ఆర్డీవో జి. బాలసుబ్రమణ్యం, తాసిల్దార్ రామకోటేశ్వరరావు, ఎండిఓ విష్ణు ప్రసాద్, మండల టిడిపి అధ్యక్షుడు వాసే మురళి, సర్పంచ్ చోరగుడి సురేఖ,టిడిపి నాయకులు ముసునూరు రాజేంద్రప్రసాద్, అడుసుమిల్లి వెంకటరత్నం, లింగమనేని వీర బసవయ్య, నుతక్కి కుటుంబరావు, మెరుగుమాల శ్రీనివాసరావు, చోరగుడి బుజ్జి బాబు, గుడివాడ శ్రీను, చోరగుడి రాజారావు, ముక్తినేని వెంకటేశ్వరరావు, లింగం శివరావు, మేడేపల్లి భూషణం, చేకూరు జగన్మోహన్రావు, పెద్దు శ్రీకాంత్, కొడాలి రామరాజు జనసేన నాయకుడు బాబ్జి, బడుగు రాము, కటారి శ్రీను ,పవన్, పలు ప్రభుత్వ శాఖల అధికారులు, పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *