సిరా న్యూస్,ఖమ్మం:
ఖమ్మం నగరంలోని జుబిలిపుర కెనరా బ్యాంక్ శాఖలో ఒక సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ గ్రూపులకి సంబంధిం చిన మెప్మ ఆర్పీ చేసిన విఫలయత్నం నివ్వెరపరిచింది. వివరాల్లోకి వెళితే.. ఖమ్మం నగరంలోని కెనరా బ్యాంక్ కి గత కొన్ని రోజులక్రితం వేరే బ్యాంక్ లోని హెల్ప్ గ్రూప్ లోన్ లని టేకోవర్ చేసికొని లోన్ సౌకర్యం కల్పించాలని విన్నపాలు వచ్చాయి. బ్యాంక్ వారు నియమాలనుగుణంగా కావల్సిన పత్రాలని సమర్పించాలని సూచించారు. తదుపరి అవసరమైన పరిశీలన చేసి బ్యాంక్ లోన్ మంజూరు చేసారు. ఈ ప్రక్రియలో భాగంగా గ్రూప్ సభ్యుల ఖాతాలోకి జమ చేయవలసిన సమయంలో కెనరా బ్యాంక్ సిబ్బంది గ్రూప్ సభ్యులను విచారిస్తుండగా, గ్రూప్ లీడర్లు తమకు 20 లక్షల రుణం మంజూరు అయినట్టు మెసేజ్ వచ్చినదని కానీ వారికి 10 వేలు రూపాయలు సబ్సిడీ వచ్చింది, తిరిగి వాటిని చెల్లించవలసిన అవసరం లేదు అని మెప్మా రిసోర్స్ పర్సన్ చెప్పినట్లుగా తెలిపినట్లు గురు సభ్యులు బ్యాంక్ సిబ్బందికి తెలిపారు. తమకు ఈ లోన్ తో ఎటువంటి సంబంధం లేదని 20 లక్షల రుణం గురించి తమకు చెప్పకుండా 10000 సబ్సిడీ వస్తుందంటే మాత్రమే తాము అప్లికేషన్‌పై సంతకాలు పెట్టామని వారు వివరించారు. సభ్యుల సమాచారం మేరకు జరిగిన మోసపూరిత చర్యని బ్యాంక్ వారు గుర్తించి సంబంధిత మెప్మా ఖమ్మం విభాగం వారి దృష్టికి తీసుకెళ్లి తగు చర్యలు తీసుకునేల భరోసా పొందారు. అటుపిమ్మట బ్యాంక్ సిబ్బంది అన్నీ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ లని ఉద్దేశిస్తూ, ఏ ఊరి నుండి అయిన సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ లు ఋణాలు అవసరం ఉన్నట్లయితే బ్యాంక్ వారిని నేరుగా సంప్రదించి లబ్ధి పొందగలరని సూచించారు. ఇట్టి మోసపూరిత చర్యని సకాలంలో గుర్తించి పెద్ద మోసాన్ని కెనరా బ్యాంకు చాకచక్యంగా స్పందించి నివారించగలిగారు. సకాలంలో కెనరా బ్యాంకు స్పందించిన తీరు అద్భుతం అని చెప్పవచ్చు. బ్యాంకు ఎంత జాగ్రత్త గా కస్టమర్ సేవలు అందిస్తున్నాయి అనే విషయాన్ని మరోసారి రుజువు చేశారు. మోసానికి పాల్పడ్డ మెప్మా రిసోర్స్ పర్సన్ పై కెనరా బ్యాంక్ చట్టపరమైన చర్యల్ని తీసుకుంటామని తెలియజేసినది.