సిరాన్యూస్, ఓదెల
ఓదెలలో కొనసాగుతున్న దుర్గ మాత నవరాత్రి ఉత్సవాలు
పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలో దుర్గ మాత నవరాత్రి ఉత్సవాలు కొనసాగుతున్నాయి. రామాలయంలో కొలువుదీరిన దుర్గామాత వద్ద 12 మంది దుర్గ మాత మాల ధరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తొమ్మిది రోజులు ప్రత్యేకమైన పూజలతో కొలువై ఉన్నారు అమ్మవారు. పూజానంతరం పూజారి భక్తులకు తీర్థప్రసాదాలు అందించారు.