సిరాన్యూస్, కాల్వ శ్రీరాంపూర్
అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుకు భూమి పూజ
ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు మామిడిపల్లి బాపయ్య
పెద్దపల్లి జిల్లాకాల్వ శ్రీరాంపూర్ మండలంలోని కిష్టంపేట గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసే డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి కురుమ పల్లి మాజీ సర్పంచ్ ,ఆలిండియా అంబేద్కర్ యువజన సంఘం జాతీయ ఉపాధ్యక్షులు మామిడిపల్లి బాపయ్య తో పాటు పలువురు అంబేద్కర్ సంఘం నాయకులతో కలిసి శుక్రవారం భూమి పూజ చేశారు. కార్యక్రమంలో ఆలిండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు సీనియర్ జర్నలిస్టు బొంకూరి మధు, జిల్లా కన్వీనర్ లంక సదయ్య, రాష్ట్ర కార్యదర్శి పాల రాజేశం, మండల కన్వీనర్ దుర్గం మల్లేష్, నాయకులు మాజీ ఎంపిటిసి మొగిలి సదానందం, మత్స్య సంపత్, పురుషోత్తం, రవి, శనిగరం శంకరయ్య, పురుషోత్తం అనిల్, తిప్పారపు రమేష్, గీసా రాజయ్య, అంబేద్కర్ సంఘం నాయకులు, గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.