సిరా న్యూస్,ఎమ్మిగనూరు;
_అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నందవరం గ్రామానికి చెందిన బోయ రవితేజకు వైద్య ఖర్చుల కోసం ప్రభుత్వం నుంచి మంజూరైన రూ.2 లక్షల విలువైన ఎల్వోసీ పత్రాన్ని బాధిత కుటుంబానికి ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్ రెడ్డి అందజేశారు. బెంగళూరులోని అపొలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఎమ్మిగనూరు మండలం ముగతిపేటకు చెందిన హరికృష్ణ కి వైద్య ఖర్చుల నిమిత్తం ప్రభుత్వం నుంచి మంజురైన రూ.3.50 లక్షల విలువైన ఎల్వోసీ పత్రాన్ని బాధిత కుటుంబసభ్యులకు అయన అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గారితో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.