సిరా న్యూస్,కాకినాడ;
జల జీవన్ మిషన్ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో అన్ని కుటుంబాలకు రక్షిత తాగునీరు నిరంతరం సరఫరా చేసేందుకు అధికారులకు దిశా నిర్దేశం చేసిన ఉపముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ పరిపాలన దక్షత అభినందనీయమని మాజీ సర్పంచ్ అడబాల రత్న ప్రసాద్ పేర్కొన్నారు. రమణయ్యపేటలో జరిగిన కార్యక్రమం ఉద్దేశించి ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం 2019లో జల జీవన్ పథకాన్ని ప్రారంభించిందని అన్నారు. ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను సరిగ్గా వినియోగించకపోవడంతో ఈ పథకం నిర్వీర్యమైందని అన్నారు. దీంతో ఈ పథకానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు వెనక్కి వెళ్లిపోయాయని అన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఈ పథకానికి ఊపిరి పోసారని అడబాల తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు.