సిరాన్యూస్, ఖానాపూర్ టౌన్
ఎస్సై ను సన్మానించిన కాంగ్రెస్ ఎస్టీ సెల్ చైర్మన్ అధ్యక్షులు బాణవత్ గోవింద్ నాయక్
నిర్మల్ జిల్లా ఖానాపూర్ పోలీస్ స్టేషన్‌కు ఇటీవల నూతనంగా విధులు నిర్వహించడానికి వచ్చిన సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ రాహుల్ గైక్వాడ్ ను ప్రజా సంఘాల నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ఎస్సై రాహుల్ గైక్వాడ్‌ను శాలువాతో సన్మానిం చారు. ఈ సందర్భంగా లంబాడా హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు, కాంగ్రెస్ ఎస్టీ సెల్ చైర్మన్ అధ్యక్షులు బాణవత్ గోవింద్ నాయక్ మాట్లాడారు. శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసు వారితో పాటు ప్రజలు కూడా స్వచ్చందంగా సహకరించాలని కోరారు . అదేవిధంగా ప్రజలకు న్యాయం కోసం జరిగే శాంతియుత పోరాటాలలో పోలీసు అధికారులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. పరస్పర సహకారంతోనే మెరుగైన సమాజం ఏర్పడుతుందని తెలిపారు. కార్యక్రమం లో అంబేద్కర్ యువజన సంఘం ఖానాపూర్ నియోజకవర్గ కన్వీనర్ మునుగురి ప్రణీత్ సాయి కుమార్ పాల్గొన్నారు.