పదేళ్లలో 226 చెరువులు కబ్జా….

సిరా న్యూస్,హైదరాబాద్;
ఛెరువులు, నాలాలపై ఉన్న నిర్మాణాలపై పూర్తి రిపోర్టును సీఎం రేవంత్ రెడ్డికి అందజేశారు అధికారులు. 2014 తర్వాత ఓఆర్ఆర్ లోపల ఉన్న ప్రతి చెరువుపైన రిపోర్టులో పూర్తి వివరాలను అధికారులు ప్రభుత్వానికి తెలియజేశారు. హైదరాబాద్ 920 చెరువులు ఉంటే అందులో 225 చెరువులు పూర్తి స్థాయిలో ఆక్రమణకు గురైనట్లు అధికారులు గుర్తించారు. 195 చెరువులు పాక్షికంగా ఆక్రమణకు గురైనట్లు అధికారులు తెలిపారు. గత పదేళ్ల కాలంలో 20 చెరువులు పూర్తిగా కబ్జా అయ్యాయని, 24 చెరువుల్లో పాక్షికంగా, 127 చెరువుల్లో పెద్ద మొత్తంలో ఆక్రమణలు జరిగాయని వెల్లడైంది. తెలంగాణ రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్ ద్వారా రేవంత్ సర్కార్ ఈ సర్వే నిర్వహించింది.హైదరాబాద్ నగరంలో చెరువులపై అధికారులు ఫోకస్ చేశారు. ప్రధానంగా హైడ్రా ఏర్పాటు చేశాక ప్రభుత్వంపై ప్రతిపక్షాలు అనేక విమర్శలు చేశాయి. దాంతో ఒక ప్లాన్ ప్రకారం ముందుకెళ్లాలని అధికారులు నిర్ణయించారు. ఇందులో భాగంగా హైదరాబాద్ నగరంలో ఉండే చెరువుల లెక్కలు తీశారు. 2014 వరకు అంటే రాష్ట్రం ఏర్పడే వరకు హైదరాబాద్ నగరంలో చెరువులు పరిస్థితి ఏంటి? అనే అంశాలతో పాటు గడిచిన పదేళ్లలో చెరువులు ఏ విధంగా కబ్జా అయ్యాయి అనేటటువంటి అంశాలపైన ఫోకస్ పెట్టారు.హైదరాబాద్ నగరంలో మొత్తం 920 చెరువులు ఉండగా.. రాష్ట్రం ఏర్పడే నాటికి 225 చెరువులు పూర్తి స్థాయిలో కబ్జాకు గురై, ఆ చెరువులు కనుమరుగు అయిపోయాయి అన్నట్లుగా అధికారులు లెక్కలు తేల్చారు. ఆ తర్వాత మరొక 44 చెరువులు గడిచిన తొమ్మిది పదేళ్లలో కబ్జాకు గురైనట్లుగా లెక్కలు వేశారు. ఇప్పుడు మొత్తంగా 269 చెరువులు పూర్తి స్థాయిలో కనుమరుగు కాగా, 127 చెరువులు పాక్షికంగా కనుమరుగు కావడం జరిగింది. ఇక, 524 చెరువులకు సంబంధించి ఎలాంటి కబ్జాలు లేనట్లుగా గుర్తించారు.ప్రధానంగా వీటన్నింటపై ఫోకస్ చేసిన అధికారులు చాలా వేగంగా వీటన్నింటిని అభివృద్ధి చేయాలి, అదే విధంగా ఉండేటటువంటి కబ్జాలు తొలగించాలని నిర్ణయించారు. అయితే, వీటన్నింటికి ఒక అడ్డండి ఏర్పడుతుంది. పూర్తి స్థాయిలో చెరువులకు బౌండరీలు ఫిక్స్ చేశాకే ముందుకెళ్లాలని నిర్ణయించారు. అందుకు అనుగుణంగా లేక్ ప్రొటెక్షన్ కమిటీ సమావేశాలు రెగులర్ గా జరుగుతున్నాయి. గడిచిన 15 రోజుల్లో రెండవ కమిటీ సమావేశం జరిగింది. 2017-18 తర్వాత లేక్ ప్రొటెక్షన్ కమిటీ ఇటీవలి కాలంలో రెండుసార్లు సమావేశం కావడం జరిగింది.
ఇందులో ముఖ్యంగా ఎఫ్ టీఎల్, బఫర్ జోన్లు గుర్తించేందుకు ఇరిగేషన్, రెవెన్యూ శాఖతో పాటు నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ, స్టేట్ రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్ సెంటర్ ద్వారా సర్వే ఆఫ్ ఇండియా అధికారులతో కలిసి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసిన హైడ్రా కమిషనర్ రంగనాథ్.. పూర్తి స్థాయిలో దీనికి సంబంధించిన డేటాను సేకరించాలని నిర్ణయించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *