సిరాన్యూస్, ఖానాపూర్ టౌన్
ఎంపీడీవో కార్యాలయంలో బతుకమ్మ సంబరాలు
* హాజరైన మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం
నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయంలో బుధవారం ఐసీడీఎస్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. ఈసందర్భంగా రంగు రంగు పూలతో బతుకమ్మలను పేర్చి ఒక చోట చేర్చి ఉద్యోగులు పాటలు పాడుతూ బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. గౌరమ్మ పూజ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం పాల్గొన్నారు. కార్యక్రమంలో సీడీపీఓ సరిత , మండల అధ్యక్షుడు దొనీకేనీ దయానంద్ , పెంబి మండల అధ్యక్షులు సప్నిల్ రెడ్డి , ఎంపీ ఓ ,రత్నాకర్ రావు,నాయకులు లక్ష్మీపతి గౌడ్, అంగన్వాడి సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.