బుల్లెట్ ట్రైన్…వయా అమరావతి

సిరా న్యూస్,విజయవాడ;
అమరావతికి ప్రధాన నగరాల నుంచి కనెక్టివిటీ పెంచేందుకు చంద్రబాబు చేస్తున్నప్రయత్నాలు కొలిక్కి వస్తున్నాయి. వచ్చే పదేళ్ల నాటికి అమరావతి మొత్తం ఓ రూపునకు వస్తుంది. ఉద్యోగ, ఉపాధినగరంగా మారుతుంది. అప్పటికల్లా బుల్లెట్ ట్రైన్ కూడా అమరావతికి వచ్చేలా చంద్రబాబు చేసిన ప్రయత్నాలు ఫలించాయి. ఢిల్లీ పర్యటన తర్వాత చంద్రబాబునాయుడు అమరావతికి బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనల గురించి మీడియాకు తెలిపారు. దక్షిణాదిలో మూడు అతి పెద్ద మెట్రో నగరాలు ఉన్నాయి. కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు రాజధానులు బెంగళూరు, హైదరాబాద్, చెన్నైలను కలుపుతూ బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలు రెడీ అయ్యాయి. ఈ బుల్లెట్ ఏపీ రాజధాని అమరావతి మీదుగా వెళ్లనుంది. అంటే.. ప్రధాన నగరాలను కలుపుతూ వెళ్లే బుల్లెట్ ట్రైన్ అమరావతి మీదుగా వెళ్తుంది. వచ్చే పదేళ్లనాటికి ఈ బుల్లెట్ ట్రైన్ పట్టలెక్కినా అప్పటికి అమరావతి కూడా ఓ రూపానికి వస్తుంది. బుల్లెట్ ట్రైన్ ప్రత్యేక ఆకర్షణ అవుతుంది. కేంద్రంలో నరేంద్రమోదీ ప్రభుత్వం ఏర్పడినప్పుడు జపాన్ సహకారంతో ముంబై టు అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్‌కు శంకుస్థాపన చేశారు. ఇప్పటికి దాదాపుగా పదేళ్లు అవుతోంది. అయినా ఇంకా పూర్తి స్థాయిలో నిర్మాణం పుంజుకోలేదు. ఎప్పటికి తొలి పరుగు పెడుతుందో చెప్పలేని పరిస్థితి. లక్ష కోట్లకుపైగా ఖర్చు అయ్యే ప్రాజెక్టు కావడంతో ఆర్థిక సమస్యలూ వెంటాడుతున్నాయి. అయినా కేంద్రం.. ముందు ముందు బుల్లెట్ ట్రైన్స్‌కు డిమాండ్ పెరుగుతుందని గట్టి నమ్మకంతో ఇతర ప్రాంతాల్లోనూ నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేసింది. బుల్లెట్ ట్రైమ్ మాత్రమే కాకుండా హైస్పీడ్ రైళ్ల నెట్ వర్క్ పైనా ప్రత్యేకంగా ఆలోచనలు చేశారు. మొత్తం ఏడు మార్గాల్లో హైస్పీడ్ రైళ్లను ప్రతిపాదించారు. కానీ అమరావతి మార్గంలో మాత్రం బుల్లెట్ ట్రైన్‌నే ప్రతిపాదించారుబుల్లెట్ ట్రైన్ల కోసం ప్రస్తుతం ఉన్న ట్రాకులు పనికి రావు. దాని కోసం ప్రత్యేకంగా ట్రాక్ వేయాల్సి ఉంటుంది. బులెట్ ట్రైన్ అనుసంధానంతో పెరగనున్న ఎకానమీ ఆక్టివిటీస్ పెరుగుతాయని.. 2026 నుండి బులెట్ ట్రైన్ పనులు ప్రారంభం అవుతాయని చంద్రబాబు భావిస్తున్నారు. ఈ అంశంపై కేంద్ర రైల్వే శాఖ పూర్తి స్థాయి డీపీఆర్ రెడీ చేసిన తర్వాత ప్రకటన ఇచ్చే అవకాశం ఉంది. సాఫ్ట్ వేర్ రంగాల్లో చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ వేగంగా అభివృద్ధి సాధిస్తు్నాయి. మూడు నగరాల మధ్య ప్రయాణాలు కూడా ఎక్కువగా ఉంటాయి. వేగవంతమైన ప్రయాణం అందుబాటులోకి వస్తే ఆదరణ ఉంటందని నమ్ముతున్నారు. అమరావతికి అన్ని వైపు నుంచి కనెక్టివిటీ పెరిగితే.. అభివృద్ది కూడా వేగంగా ఉంటుందని ప్రభుత్వ వర్గాలు నమ్మకంతో ఉన్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రత్యేకమైన ఆసక్తితో రైలు, రోడ్డు, విమాన మార్గాల ద్వారా సౌకర్యాలు మరింత పెంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *