సిరాన్యూస్, బేల
డిగ్రీ కాలేజీల నిరవధిక బంద్ : ప్రిన్సిపాల్ డా వరప్రసాద్ రావు
డిగ్రీ కాలేజీల నిరవధిక బంద్ చేపట్టినట్లు తెలంగాణ ప్రైవేట్ డిగ్రీ అండ్ పీజీ కళాశాలల మేనేజ్‌మెంట్ అసోసియేషన్ రాష్ట్ర సభ్యులు , ఆదిలాబాద్ జిల్లా బేల కీర్తన డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డా వరప్రసాద్ రావు అన్నారు. సోమవారం బేల కీర్తన డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రిన్సిపాల్ డా వరప్రసాద్ రావు మాట్లాడారు. గత 3 సంవత్సర ల నుండి ఫీ రీయంబర్స్మెంట్ రాక పోవడంతో కళాశాల నిర్వహణ పెను భారం గా మారిందని తెలిపారు. కళాశాల సిబ్బంది వేతనాలు, అద్దె లు చెల్లింపు లు చేయడం కష్టం ఆవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే ఎన్నో లక్షల అప్పులు చేయడం తో బయట అప్పులు కూడా ఇవ్వడం లేదని తెలిపారు . పాత అప్పులు కి వడ్డీ కట్టడం కూడా కష్టం అవుతుందని, ఇక గత్యంతరం లేక తప్పనిసరి పరిస్థితుల్లో రాష్ట్రం మొత్తం డిగ్రీ కాలేజ్ ల పీజీ కాలేజ్ ల బంద్ చేయాలని రాష్ట్ర అధ్యక్షుడు బొజ్జ సూర్యనారాయణ రెడ్డి పిలుపు మేరకు డిగ్రీ కాలేజీల నిరవధిక బంద్ పాటిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో వైస్ ప్రిన్సిపాల్ గెడం ప్రవీణ్, సీనియర్ అధ్యాపకులు పుష్ప, ప్రియాంక, సౌందర్య పాల్గొన్నారు.