సిరాన్యూస్, ఆదిలాబాద్
తాత్కాలికంగా తరోడ రోడ్డు ప్రారంభం : ఎమ్మెల్యే పాయల్ శంకర్
* నాలుగైదు రోజులో ప్రయాణాలు సాగించవచ్చు
* నాలుగున్నర కోట్లతో డైవర్షన్ రోడ్డు ప్రారంభం
* రోడ్డు నిర్మాణ పనుల పరిశీలన
గత నాలుగైదు నెలల నుండి తరుడా బ్రిడ్జ్ కృంగిపోవడంతో ప్రజలకు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడిందని అదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలోని తరోడ బ్రిడ్జ్ వద్ద తాత్కాలికంగా నిర్మిస్తున్న రోడ్డు నిర్మాణ పనులను ఎమ్మెల్యే సోమవారం పరిశీలించారు. రోడ్డు నిర్మాణం సంబంధించిన పలు విషయాలను, సూచనలను అధికారులకు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ తరోడ బ్రిడ్జి వద్ద రూపాయలు నాలుగున్నర కోట్లతో నిర్మిస్తున్న డైవర్షన్ రోడ్డు నిర్మాణ పనులు మరో రెండు నెలలు అయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఆలోపు ప్రజలకు రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా తాత్కాలికంగా రోడ్డు నిర్మాణం చేపట్టడం జరిగిందన్నారు. ప్రస్తుతం ఉన్న బ్రిడ్జి ను కూలగొట్టేసి అక్కడ కొత్త బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారని తెలిపారు. అలాగే బోరజ్ నుంచి మహారాష్ట్ర వరకు రోడ్డు నిర్మాణ పనులు జూన్, జూలై నెలలో పూర్తి చేయాలని ప్రణాళిక ప్రకారం పోతున్నామని అన్నారు.తాత్కాలికంగా తరోడ రోడ్డు పై నాలుగైదు రోజులో ప్రయాణాలు సాగించవచ్చు అన్నారు. ప్రభుత్వం కేటాయించిన నిధులు ఖర్చు చేసి ప్రజల అసౌకర్యాన్ని దూరం చేయాలని అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్యే వెంట అధికారులు, బీజేపీ నాయకులు తదితరులు ఉన్నారు.