khanapur Hindu Utsava Samiti:దొరికిన 2తులాల బంగారు గొలుసు గుమ్మూల అశోక్ అంద‌జేత : హిందూ ఉత్సవ సమితి సభ్యులు

సిరాన్యూస్‌, ఖానాపూర్ టౌన్
దొరికిన 2తులాల బంగారు గొలుసు గుమ్మూల అశోక్ అంద‌జేత : హిందూ ఉత్సవ సమితి సభ్యులు

నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలో శనివారం జరిగిన దసరా ఉత్సవాల్లో శ్రీ రామనగర్ కి చెందిన గుమ్మూల అశోక్ 2 తులాల బంగారు అభరణం ప‌డిపోయింది. ఉత్సవాలు ముగించి త‌ర్వాత‌ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు సురేష్ , ప్రధాన కార్యదర్శి శెట్టి శ్యాం, సభ్యులు తుమన్నపెల్లి లక్ష్మణ్ , కృష్ట ల‌కు వారికి దొరికిన 2 తులాల బంగారు చైన్ వారివద్ద ఉండగా బంగారం కోల్పోయిన వ్యక్తి సోషల్ మీడియా ద్వారా వచ్చిన సారాంశాన్ని వాట్సాప్ వేదికగా కలేరి దివాకర్ స్పందించారు. ఈ విషయాన్ని తన మిత్రుడు శ్యాంకి తెలుపగా వెంటనే స్పందించి రామ్ నగర్ యూత్ అధ్యక్షులు నిమ్మల సాయి కి తెలుపగా పెద్దల సమక్షంలో ఈ బంగారు చైన్ బాధిత గుమ్ముల అశోక్ కి అంద‌జేశారు. కార్యక్రమంలో అల్లాడి వెంకటేశ్వర్లు , కరిపి శ్రీను ,కరింగుల సుమన్ ,అశోక్ , తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *