సిరాన్యూస్, కుందుర్పి
కమ్మర క్రిష్ట కుటుంబానికి రూ.5వేలు అందజేత : భవన నిర్మాణ కార్మికులు
కుందుర్పి మండల కేంద్రంలో వెల్డింగ్ వర్కర్ కమ్మర క్రిష్ట సోమవారం మృతి చెందారు. మంగళవారం స్థానిక భవన నిర్మాణ కార్మికులు బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి రూ.5 వేల రూపాయలు ఆర్థిక సాయం అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్ మారుతీశ్వరి రామమూర్తి, బేల్దారి రామాంజనేయులు, బేల్దారి వెంకటేశులు, మరిస్వామి,లోకేష్, తలారి పెద్ద ఓబులేష్, భవన నిర్మాణ కార్మికుల సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.