BJP Kakinada Ravuri Sudha: స‌భ్య‌త్వ న‌మోదు ల‌క్ష్యం చేరాలి:  బీజేపీ కాకినాడ జిల్లా ఇన్‌చార్జ్‌ రావూరి సుధా

సిరాన్యూస్‌, సామర్లకోట
స‌భ్య‌త్వ న‌మోదు ల‌క్ష్యం చేరాలి:  బీజేపీ కాకినాడ జిల్లా ఇన్‌చార్జ్‌ రావూరి సుధా

బీజేపీ స‌భ్య‌త్వ న‌మోదు ల‌క్ష్యానికి చేరుకునేలా ప్ర‌తి ఒక్క‌రూ కృషి చేయాల‌ని భారతీయ జనతా పార్టీ కాకినాడ జిల్లా ఇన్చార్జి రావూరి సుధా అన్నారు. మంగ‌ళ‌వారం పెద్దాపురం పట్టణం మెయిన్ రోడ్‌లో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వ‌హించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ కాకినాడ జిల్లా ఇన్‌చార్జ్‌ రావూరి సుధా హాజ‌రై మాట్లాడారు.భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రతి ఆరు సంవత్సరాలకు ఒకసారి చేపట్టడం జరుగుతుందని తెలిపారు.ఈసారి కూడా ఈ కార్యక్రమాన్ని ఎంతో విజయవంతంగా దేశం మొత్తం మీద చేపట్టడం జరిగిందని చెప్పారు. సభ్యత నమోదు కార్యక్రమం రెండో విడత ఆఖరి రోజు కావడంతో జిల్లా మొత్తం పెద్ద ఎత్తున సభ్యత నమోదు కార్యక్రమం చేయడం జరిగిందని తెలియజేశారు. కార్య‌క్ర‌మంలో స్టేట్ సివిల్ సప్లై బోర్డు డైరెక్టర్ తుమ్మల పద్మజ, పెద్దాపురం నియోజకవర్గ ఇన్చార్జి కొక్కిలిగడ్డ గంగరాజు, బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు దుర్గా మోహనరావు,నియోజక వర్గ కో కన్వీనర్ చెరుకూరి రవికృష్ణ ,కాకినాడ జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు ఏడిద కృష్ణ, రాష్ట్ర ఎస్సీ సెల్ కార్యవర్గ సభ్యులు బక్కి వీర్రాజు, పెద్దాపురం రూరల్ అద్యక్షుడు పోతుల వీర ప్రభాకర్, బీజేపీ నాయకులు మోటూరి వీరబాబు, పొన్నూరు మణికంఠ, దాసరి రమేష్, నింగినీడి రాజేంద్ర, యానాల రాంబాబు, చాపల చంద్రరావు,కె.భార్గవి, నెక్కల ప్రకాష్, కొత్త వీరభద్ర రావు, కేదారిశెట్టి శివ బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *