మంత్రి కొండా సురేఖ
సిరా న్యూస్,ములుగు;
సమ్మక్క సారలమ్మ అమ్మవార్ల దర్శనానికి రావడం చాలా సంతోషమని మంత్రి కొండా సురేఖ అన్నారు. మేడారం జాతర సమయంలో కోట్లాది భక్తులు అమ్మవార్లను దర్శించుకుంటారు, భక్తులకు చీమ కూడా కుట్టకుండా తల్లులు కాపాడుతారు. మన ప్రభుత్వం గత పదేళ్లు పాలన లో లేకపోవడం వలన జాతీయ పండుగ గా జరుపుకోలేక పోతున్నాం భాధాకరమని అన్నారు. మేడారం జాతరకు జాతీయ హోదా కల్పించాల్సిన అవసరం ఉంది. సీతక్క గిరిజన బిడ్డగా సమ్మక్క సారలమ్మ జాతర మేడారం అభివృద్ది కోసం ఎంతో కృషి చేసింది. సమ్మక్క సారలమ్మ అమ్మవార్లు మా ఇంటి ఇలవేల్పు మా కుటుంబంలో ఈ రోజు మా మనువడు మొక్కు చెల్లించడానికి కుటుంబ సమేతంగా రావడం జరిగింది.
రానున్న రోజుల్లో మేడారం లో మరింత అభివృద్ధి జరిగే విధంగా ప్రణాళిక రూపొందిస్తామని అన్నారు.