సిరా న్యూస్,హనమకొండ;
హనుమకొండ జిల్లా ధర్మ సాగర్ మండలంలో కాంగ్రెస్ నాయకులు నిరసనకు దిగారు. జెండా మోసిన కార్యకర్తలను కాదని.. కడియం వర్గీయులకు ప్రాధాన్యత ఇస్తున్నారని ఆరోపించారు. సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ, కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీలకు సమాచారం లేదు. కార్యక్రమం ఏదైనా కడియం వర్గీయులదే పై చేయి. ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు కూడా మా మాట వినడం లేదు. స్టేషన్ ఘనపూర్ లో సింగపురం ఇందిరా కాంగ్రెస్ పార్టీనీ లో బ్రతికించింది. ఇందిరమ్మ ఇళ్ల కమిటీలను రద్దు చేయాలి. రద్దు చేసి పాత కాంగ్రెస్ వారికి ప్రాధాన్యత ఇవ్వాలి. కడియం శ్రీహరి టిడిపి, టిఆర్ఎస్ లో ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాం. కాంగ్రెస్ పార్టీలో ఉండి కూడా ప్రతిపక్షంలో ఉన్నట్టే ఉందని అన్నారు.