MLA Payal Shankar: జల్ జంగల్ జమీన్ కోసం పోరాడిన గొప్ప నాయకుడు కొమురం భీం : ఎమ్మెల్యే పాయల్ శంకర్

సిరాన్యూస్, ఆదిలాబాద్‌
జల్ జంగల్ జమీన్ కోసం పోరాడిన గొప్ప నాయకుడు కొమురం భీం : ఎమ్మెల్యే పాయల్ శంకర్
* కొమురం భీం ఘనంగా నివాళులు

జల్ జంగల్ జమీన్ కోసం పోరాడిన గొప్ప నాయకుడు కొమురం భీం అని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. కొమురం భీం వర్ధంతి ని పురస్కరించుకొని బీజేపీ ఆధ్వర్యంలో కొమురం భీం చౌక్ లోని భీమ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ నిరంకుశ పాలనను ఎదిరించడానికి జల్ ,జంగల్, జమీన్ కోసం పోరాడిన గొప్ప నాయకుడు కొమరం భీమ్ అన్నారు. భౌతికంగా ఆయన మన మధ్య లేనప్పటికీ ఆయన ఆశయాలకు అనుగుణంగా మనమందరం ముందుకు పోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. మారుతున్న పరిస్థితులలో ఆదివాసుల జీవితాలలో వెలుగులు నింపాల్సిన అవసరం ఉందన్నారు. పార్టీలు ఏవైనా కావచ్చు.. పాలకులు ఎవరైనా కావచ్చు ఆనాడు కొమరం భీం కన్నా కళలు , ఆశ‌యాల‌ను పూర్తిచేయాల్సిన అవసరం ఉందన్నారు. గడచిన పదేళ్లలో ఆదివాసి బతుకులు మారలేదన్నారు. గత ప్రభుత్వం మాదిరిగానే కాంగ్రెస్ ప్రభుత్వం పాలనా కొనసాగిస్తుందని ఎద్దవా చేశారు. ఆదివాసులు సాగు చేసుకుంటున్న భూములకు ఇంతవరకు పట్టాలు ఇవ్వలేదన్నారు. గిరిజనుల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం వేల కోట్ల మంది రూపాయలు ఖర్చు చేసిందన్నారు. అయినప్పటికీ గతంలో ఉన్న ప్రభుత్వం ఆ నిధులను పక్కదారి పట్టించిందని గుర్తు చేశారు. కార్యక్రమంలో నాయకులు లాలా మున్నా, జోగుర‌వి, నైతం రవీందర్, దశరథ్ పటేల్, రాకేష్, నగేష్ రెడ్డి, శ్రీనివాస్, అశోక రెడ్డి , సందీప్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *