ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన
సిరా న్యూస్,కరీంనగర్;
తన కొడుకుకు బీసీ వెల్ఫేర్ హాస్టల్ లో సీట్ ఇప్పిస్తానంటూ రూ. 75 వేల రూపాయలు తీసుకొని మోసం చేసినఘటన కరీంనగర్ జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసింది. గన్నేరువరం మండల కేంద్రంలోని అక్షర మీసేవ నిర్వాహకులు తెల్ల రవీందర్, మహేష్ అనే అన్నదమ్ములు ఇద్దరు పై కరీంనగర్ కు చెందిన వడ్లకొండ వాణి గన్నేరువరం పోలిస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. చొప్పదండి బీసీ వెల్ఫేర్ హాస్టల్ లో సీటు ఇప్పిస్తా నంటూ నమ్మించి 75 వేలు తీసుకున్నారని మహిళ ఆరోపించింది.
సీటు రాకపోవడంతో.. మీ సేవా నిర్వహకులు డబ్బులు ఇవ్వకుండా మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేసింది. తన డబ్బులు తనకు ఇప్పించి న్యాయం చేయాలని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు లో పేర్కొంది రజిని. తన దగ్గర డబ్బులు తీసుకున్నట్టు ఆడియో సంభాషణను కూడా పోలీసులకు అప్పగించినట్లు బాదితురాలు తెలిపారు. బాదితురాలి ఫిర్యాదు ఇచ్చిన ఫిర్యాదు పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.