సిరా న్యూస్,జగిత్యాల;
జగిత్యాల పట్టణంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో తొమ్మిదవ తరగతి చదువుతున్న మైనర్ బాలిక (14) గురువారం రాత్రి ఇంట్లో ఎవరు లేని సమయంలో ఫ్యానుకు ఉరి వేసుకుని సూసైడ్ చేసుకుంది. గత కొంత కాలంగా తన క్లాస్ మెంట్ వేధింపుల కారణంగా సూసైడ్ చేసుకుందని కుటుంబ సభ్యులు ఆరోపించారు. కూతురి మరణంతో ఏడుస్తూ సృహ కోల్పోయిన తల్లిని ఆస్పత్రికి తరలించిన కుటుంబ సభ్యులు. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసారు.