ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి
సిరా న్యూస్,సూర్యాపేట;
మూసీ సుందరీకరణ, రాష్ట్ర అప్పులు, గ్రూపు-2 లపై సీఎం రేవంత్ వ్యాఖ్యలపై మాజీమంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిమండిపడ్డారు. రేవంత్ వ్యాఖ్యలు.. బాధ్యతారాహిత్యంగా, సీఎం స్థాయిని దిగజార్చేలా ఉన్నాయి. రాష్ట్ర ప్రజల పరువు పోయేలా రేవంత్ ఉపన్యాసాలున్నాయి. రేవంత్ వ్యక్తిగా పరువు పోగొట్టుకుంటే ఫర్వాలేదు.. తెలంగాణ సీఎం గా పరువు పోతే ఎవరికి నష్టం..? తెలంగాణా ఆదాయం పెంచింది కేసీఆర్. 2014 బడ్జెట్.. మొన్నటి బడ్జెట్ చూస్తే ఎవరు ఆదాయం పెంచారో తెలుస్తది. 420 హామీలోద్దు కేసీఆర్ పథకాలైనా ఇస్తే చాలని ప్రజలు అంటున్నారు. రాష్ట్ర ఆదాయం , అప్పుల పై చర్చకు సిద్ధమే. సెక్యురిటి లేకుండా సీఎం మూసీ ప్రాంతంలో తిరిగి చూపించాలి. ఆశోక్ నగర్ నిరుద్యోగుల వల్లే రేవంత్ కి అధికారం. ఇప్పుడు అశోక్ నగర్ పేరు వింటే రేవంత్ కి భయమేస్తోంది. యువత ఆవేశం ఇలానే కొనసాగితే తెలంగాణ మొత్తం అశోక్ నగర్లే అవుతాయి. కాంగ్రెస్ సినియర్లే సీఎం ఏకపక్షంగా వెళ్తున్నారని అంటున్నారు. ఇప్పటికే ప్రజలకు దూరమౌతున్న రేవంత్.. దూకుడు మానకపోతే పార్టీకి దూరమౌతావని అన్నారు.