సిరా న్యూస్,ముంబై;
భారత రాజకీయాల్లో ఏదైనా సాధ్యమేనని మహారాష్ట్ర రాజకీయాలు నిరూపిస్తున్నాయి. అక్కడ మహాయుతి కూటమి, మహా వికాస్ అఘాడి కూటమి ఎన్నికల్లో తలపడుతున్నాయి. మహా యుతి కూటమికి బీజేపీ నేతృత్వం వహిస్తూండగా.. ఎన్సీపీ, శివసేన భాగస్వాములు. మహా వికాస్ ఆఘాడిలో ఎన్సీపీ, శివసేన భాగస్వాములే. కాకపోతే పాత యజమానులు ఈ పార్టీలకు కొత్త ఓనర్లు. ఓటర్లకు ఈ సారి ఈ గందరగోళం తప్పదు. లోక్సభ ఎన్నికల్లో ప్రతిపక్ష మహా వికాస్ అఘాడి మొత్తం 48 స్థానాల్లో 30 లోక్ సభ సీట్లను కైవసం చేసుకుంది. మహారాష్ట్రలో రాజకీయం భిన్నంగా ఉంది. రెండు కూటములు .. ప్రతి కూటమిలో మూడు రాజకీయ పార్టీలున్నాయి. మహారాష్ట్రలో లోక్సభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఒక్కటే 13 సీట్లు గెలుచుకుంది. బీజేపీ అనుకున్నని స్థానాల్లో గెలవలేకపోయింది. తొమ్మిది సీట్లలో గెలిచింది. తర్వాత ఉద్దవ్ ధాకరే శివసేన పార్టీ 9 సీట్లలో గెలిచింది. శరద్ పవార్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ 8, ముఖ్యమంత్రిగా ఉన్న శివసేన షిండే పార్టీ 7 చోట్ల గెలిచింది. ఒక్క చోట ఎన్సీపీ అజిత్ పవార్ పార్టీ గెలిచింది. మహారాష్ట్రలో ఎలాంటి పరిస్థితి ఉందంటే.. ఏ పార్టీకి కనీసం 30 శాతం ఓట్లు తెచ్చుకునే పరిస్థితి లేదు. లోక్ సభ ఎన్నికల సరళిని చూస్తే భారతీయ జనతా పార్టీకి 9 లోక్ సభ సీట్లే వచ్చినా ఆ పార్టీకి ఇరవై ఆరు శాతం వరకూ ఓట్లు వచ్చాయి. దీనికి కారణం ఎక్కువ సీట్లలో పోటీ చేయడం. అదే అత్యధిక సీట్లు సాధించిన కాంగ్రెస్ పార్టీకి వచ్చి న ఓట్లు పదహారు శాతమే. కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాలుగా ఉన్న శివసేన ఉద్దవ్ ధాకరే, ఎన్సీపీ శరద్ పవార్ పార్టీలకు కలిపి ఇరవై ఏడు శాతం ఓట్లు వచ్చాయి. ఇలా అన్ని పార్టీలు ఓట్లు చీల్చుకున్నాయి. అదే సమయంలో మజ్లిస్ కూడా మహారాష్ట్రలో బలంగానే ఉంది. మహారాష్ట్రలో బీజేపీ, కాంగ్రెస్ పోటీ చేసే స్థానాలు మినహా ఇతర చోట్ల.. రెండు శివసేన పార్టీలు, రెండు ఎన్సీపీ పార్టీలు బరిలో ఉంటాయి. వాటికి వేర్వేరు గుర్తులు అయినప్పటికీ క్యాడర్,ఓటర్లు అంతా ఆ పార్టీకి చెందిన వారే. పార్లమెంట్ ఎన్నికల్లో అసలు పార్టీలను చేతుల్లోకి తీసుకున్న నేతలకు ఇబ్బంది ఎదురయింది. షిండే శివసేన పార్టీ తనదేనని నిరూపించేందుకు కాస్త సీట్లు తెచ్చుకున్నారు కానీ అజిత్ పవార్ మాత్రం ఎన్సీపీ తనదేనని నిరూపించుకోలేక పోయారు. ఒక్క చోటే గెలిచారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఇవ్వబోయే తీర్పు.. ఆయా రాజకీయ పార్టీల భవిష్యత్ ను కూడా తేల్చేస్తాయి. అజిత్ పవార్ తన పార్టీకి మెరుగైన సీట్లు తెట్టిపెట్టలేకపోతే మళ్లీ పార్టీని విలీనం చేసుకోవాల్సిందే. మరోసారి అధికారంలోకి షిండే రాలేకపోతే అందరూ శివసేనలోకే వెళ్లిపోతారు. అందుకే ఈ ఎన్నికలు రాజకీయ పార్టీల ఉనికి కూడా కీలకమే