సిరాన్యూస్, ఓదెల
రూపు నారాయణపేటలో ఎమ్మెల్యే విజయ రమణారావు చిత్రపటానికి పాలాభిషేకం
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని రూపు నారాయణపేట గ్రామంలో శనివారం పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు చిత్రపటానికి గ్రామస్తులు పాలాభిషేకం చేశారు. ఈసందర్బంగా రూపు నారాయణపేట గ్రామం నుండి ఇందుర్తి గ్రామం వరకు రెండు కోట్లతో బీటి రోడ్డు మంజూరు చేసినందుకు ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావుకు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపి అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మూల ప్రేమ్ సాగర్ రెడ్డి మాట్లాడుతూ పెద్దపెల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు గెలిచినప్పటినుండి పెద్దపెల్లి నియోజకవర్గ అభివృద్ధికి ప్రణాళిక బద్ధంగా కృషి చేస్తున్న విజయ రమణారావుకు ఓదెల మండల ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మూల ప్రేమ్ సాగర్ రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ ఆళ్ల సుమన్ రెడ్డి, సింగిల్ విండో డైరెక్టర్ బొంగోని శ్రీనివాస్ గౌడ్, మాజీ సర్పంచ్ అంకం రమేష్,నీళ్ల శ్రీనివాస్, రెడ్డి రజనీకాంత్. సమ్మిరెడ్డి, మాజీ సర్పంచులు మాజీ ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.