అర్హులైన లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేసిన మంత్రులు పొన్నం ప్రభాకర్.. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి..
సిరా న్యూస్,హైదరాబాద్;
గోశా మహల్ లబ్దిదారులకు మేడ్చల్ జిల్లా రాంపల్లి లో ఉన్న డబుల్ బెడ్ రూమ్స్ పారదర్శకంగా కేటాయించామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.గోషా మహల్ నియోజకవర్గంలో 144 మందికి డబుల్ బెడ్రూం ఇళ్ల కేటాయింపు జరుగుతుంది. ఏ ఏ ఇంట్లో ఇళ్లు సంక్షణ్ అయిందో కంప్యూటర్ ద్వారా ఎంపిక చేయబడింది. రాష్ట్ర ప్రభుత్వం తరుపున మీకు శుభాకాంక్షలు. దీపావళి కి మరింత ఉత్సాహంగా జరుపుకోవాలి. మీకు కేటాయించిన రాంపల్లి లో డ్రైనేజీ, తాగు నీరు,విద్యుత్ ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించాం. మీరు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఒక రూపాయి లేకుండా డబుల్ బెడ్రూం కేటాయించారు. పిల్లి గుడిసెల్లో ఒక యూనియన్ గా ఏర్పడి మంచి వసతులు కల్పించుకున్నారు. మీరు కూడా యూనిటీ గా ఉండి ఏర్పాటు చేసిన వసతులు కాపాడుకోవాలి. ప్రభుత్వం ఏ కార్యక్రమం చేసిన ఇబ్బంది పెట్టే కుట్ర జరుగుతుంది. ఇందిరమ్మ ఇళ్లు ప్రతి నియోజకవర్గానికి 3500 ఇళ్లు మంజూరు చేసుకున్నాం. మూసి పునర్జీవనంపై పై అనేక అభాండాలు వేస్తున్నారు అక్కడున్న పేదవారిని అక్కడే వదిలేస్తారా. మూసి రివర్ ఫ్రంట్ ఏర్పాటు చేసింది మీరు కాద. ఇప్పుడు వారికి డబుల్ బెడ్రూం లు కేటాయించి మెప్మా ద్వారా వారికి ఉపాధి అవకాశాలు,పిల్లలకు చదువులు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తుంటే ఓర్వలేకపోతున్నారు. తెలంగాణ ఏర్పడినప్పుడు గళ్ళల పైసలతో ఇచ్చాం. కానీ గత ప్రభుత్వం 7 లక్షల కోట్ల అప్పు చేసి 40 వేల కోట్ల బిల్లులు పెండింగ్ బకాయిలు చేశారు. రాష్ట్ర ప్రజలను ఆందోళనకు గురి చేసే విధంగా ప్రభుత్వం ఇబ్బందులు పరిష్కరిస్తూ ముందుకు వెళ్తుంటే రాజకీయం చేస్తున్నారు. మీరు బాధ్యత గల ప్రతిపక్షం అయితే నిర్మాణాత్మక సలహాలు ఇవ్వండి. కాంగ్రెస్ పార్టీకి పరిపాలన ఎలా చేయాలో ప్రతిపక్షాలకు ఎలా గౌరవం ఇవ్వాలో తెలుసు.
డబుల్ బెడ్రూం లు పొందిన వారికి శుభాకాంక్షలు.