– దిక్కుతోచని స్థితిలో రైతన్నలు
సిరా న్యూస్,కౌతాళం;
మండలం నది తీర గ్రామాలైన మేళిగనూరు, నదీచాగీ,కుంబళనూరు,క్యాంప్,గుడికంబాలి మురళి వల్లూరు గ్రామాలలో తుఫాన్ కారణంగా రాత్రి కురిసిన భారీ వర్షానికి వరి పంట నేలకొరిగిన పంటలకు అపార హాని జరిగింది,నదిచాగీ గ్రామంలో దాదాపు వరి పంట వేసిన ప్రతి రైతు పొలాల్లో 70శాతం పంట వర్షానికి పడి అపార నష్టం మిగిల్చింది రైతులు తమ భాదను చెప్పుకున్నారు,కేవలం 20-25రోజుల్లో కోతకు వచ్చే పంట ఇంతలా దెబ్బ తినడంతో దిగుబడి భాగిగా తగ్గి తీరని నష్టాన్ని మిగిల్చాయి అని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. వర్షం ఇంతటితో ఆగకుండా కొనసాగితే రైతులు ఎకరానికి 40వేల రూపాయిల పెట్టుబడి రాక అప్పులపాలు అవ్వొచ్చనే ఆందోళన చెందుతున్నారు,ప్రభుత్వం రైతుల అవస్థలను గమనించి వెంటనే సంబంధిత అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యవేక్షణ నిర్వహించి నష్టపోయిన రైతులను ఆదుకోవాలని రైతులు జంబనగౌడ,యంకరెడ్డి,రాము, లింగనగౌడ,ఇస్బు,చాకలి సతిష, బసవ కోరారు.