ఇంకా రైతు సాయుధ పోరాటం గుర్తులు

సిరా న్యూస్,శ్రీకాకుళం;
నాటి నక్జల్ బరి, గిరిజన సాయుధభూపోరాటం నుంచి నేటి మావోయిస్టు పార్టీ వరకు సీక్కోలు జిల్లా పేరు మార్మోగుతోంది. ఉద్యమాల ఖిల్లా సిక్కోలు జిల్లా అంటు చరిత్రలో నిలుస్తోంది. నాడు భూ స్వాములు పెత్తనం, వైద్య, విద్య,రహదార్లులేక నానా అవస్థలు పడడంతో ఉద్యమం 1960 లో మొదలైంది. ఇది రాను రాను సాయుధ భూపోరాటంగా మారింది. అమరులైన కామ్రేడ్స్ వెంపటాపు సత్యం, ఆదిబట్ల కైలాసంతో ప్రారంభమై ఉద్దానం ప్రాంతానికిచెందిన పంచాది కృష్ణ మూర్తి, తామాడ గణపతిలు సాయుధ పోరాటానికి నాయకత్వం వహించారు. వారికి సుబ్బారావు పాణిగ్రాహి, చాగంటి భాస్కర రావు, మల్లికార్జున, పంచాది నిర్మల, సరస్వతి అంకమ్మలు ఇలా అనేక మంది జిల్లా కు చెందిన వారే ఈ ఉద్యమానికి నాయకత్వం వహించారు.1968 సంవత్సరం నవంబర్ 25న నూతన విప్లవ ప‍ంథా నాయకుడు వెస్ట్ బెంగాల్ కు చెందిన కామ్రేడ్ చారు మజుందార్ పిలుపు మేరకు శ్రీకాకుళం సాయుధ పోరాటం ప్రారంభమైందని చెప్పుకుంటుంటారు. ఈ ఉద్యమ నాయకుల్లో పంచాది కృష్టమూర్తి, తామాడ గణపతి,నిర్మల తదితరులు 1969 మే 27న ఎన్ కౌంటర్ అయ్యారు. ఆ ఎన్ కౌంటర్ లో ఆరుగురు కామ్రేడ్స్ పంచాది కృష్ణ మూర్తి, తామాడ చినబాబు, బైనపల్లి పాపారావు, దున్న గోపాల్ రావు, రామచంద్ర ప్రధానో, నిరంజన్ సాహు, శృంగవరపు నర్సింహ మూర్తి అమరులయ్యారు. ఇది తొలిభూటకపు ఎన్ కౌంటర్ గా అప్పటి నక్జబరి పార్టీ ప్రకటించింది. ఈ అమరులైన వారిలో పలాస మండలం బొడ్డపాడుకు చెందిన పంచాది కృష్టమూర్తి వంటి ముఖ్యనేతలున్నారు. అప్పటినుంచి బొడ్డపాడుకు ప్రత్యేకత సంతరించుకుంది. ఉవ్వెత్తి ఎగిసిపడిన శ్రీకాకుళం సాయుధపోరాటం దేశవ్యాప్తంగా సంతరించుకుంది. శ్రీకాకుళ పోరాటం వెనకడుగు వేసినా శ్రీకాకుళం నిప్పురవ్వలు దేశం నలుమూలలా వెదజల్లి రైతాంగ ఉద్యమాలను సృష్టిస్తున్న శ్రీకాకుళ సాయుధ పోరాటానికి విప్లవ జేజేలు పలికారు. ఓ వైపు ఉద్యమం కొనసాగిస్తునే మరో వైపు విద్యాభివృద్ధి ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి బొడ్డపాడులో గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశారు. జిల్లాలో ఉద్దానం ప్రాంతానికి చెందిన వారే మావోపార్టీలో పనిచేసిన వారున్నారు. బొడ్డపాడులో కూడ గతంలో మావో పార్టీలో పనిచేసి జైలు జీవితాన్ని అనుభవించిన వారున్నారు. ఉద్యమాలు పేరు చెప్పిన వెంటనే ప్రధానంగా గుర్తొచ్చేది శ్రీకాకుళం జిల్లా ఉద్యమం అలాంటి ఉద్యమం ఈరోజు చాలా నీరుగారిపోయింది అప్పుడు ఉన్న నేతలు లేరు ఎంతో పేరు ప్రత్యర్థులు కందిన మావోయిస్టులుగా ఈ ప్రాంతం పేరు ప్రఖ్యాతలు తీసుకొని వచ్చింది వాళ్ళు గుర్తులుగానే నేటికీ కొన్ని స్థూపాలు విగ్రహాలను కూడా ఇక్కడ స్థాపించారు. ఇప్పటికి కూడ భూస్వామ్య వ్యవస్థపై పోరాడుతునే ఉంటారు. బొడ్డపాడు గ్రామమంటే నిరంతరం పోలీసులు నిఘా పెట్టే రోజులే అధికమని చెప్పాలి. ఈ సందర్భంగానే బొడ్డపాడులో తొలుత గ్రంధాలయాన్ని కూడ ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ఆ గ్రామంలో పంచాది కృష్టమూర్తి , చారుమజూందర్ వంటి అగ్రనేతలు విగ్రహాలున్నాయి. ఆ గ్రామాన్ని సందర్శిస్తే ఉద్యమకారులు, రచయతులు, మాజీ మావో సభ్యులుకనపిస్తారు. శ్రీకాకుళం గిరిజన రైతాంగ సాయుధపోరాట గత స్మృతులను నెమరు వేసుకుంటును ఉంటారు. అమరుల బంధుమిత్రుల కమిటీ ఏర్పాటు చేసారు. రాష్ట్ర కార్య దర్శి పద్మకుమారి మాట్లాడుతూ శ్రీకాకుళ ఉద్యమం లో పంచాది నిర్మల వంటి ఎంతో మంది మహిళలు పాల్గొని నేటి మహిళాలోకానికి ఆదర్శమయ్యారని, ఇప్పుడు కూడా మావోయిస్టు ఉద్యమంలో మహిళల పాత్ర ఎక్కువగానే ఉందన్నారు. అమరుల బంధు మిత్రుల కమిటీ రాష్ట్ర నాయకులు జోగి కోదండరావు మాట్లాడుతూ సరిగ్గా ఇదే రోజున 1969 మే 27న నిరాయుధులైన పంచాది కృష్ణమూర్తి, తామాడ చిన బాబు, బైనపల్లి పాపారావు, దున్న గోపాలరావు, రామ చంద్ర ప్రదానో, నిరంజన్, శృంగవరపు నరి సింహులును పట్టుకొని కాల్చి చంపి ఎన్కౌంటర్గా చిత్రీకరించారని ఆప్రాంతీయులు వర్థంతి సభలో వెల్లడిస్తుంటారు.ఉద్యమం కోసం ప్రజల రక్షణ కోసం ఏదో సాధిద్దామని ఇందులోకి వచ్చాము పోరాటాలు వైపు వెళ్లి కొన్ని దళాల్లో పనిచేసే వచ్చాము కానీ ప్రజల్లో మాత్రం ఎటువంటి మార్పు లేదు భూస్వాములు చేసే ఆగడాలు ఎన్ని అన్ని కాదు దళితులపై నేటికీ ఎన్నో అవమానాలు కూడా ఎదుర్కొంటున్నారు. ఇప్పటికీ పోలీసులు మా ప్రాంతానికి వచ్చి నా పేరుతో సహా ఈశ్వరి అనే పేరుతో పోలీస్ స్టేషన్లో రికార్డులు ఉన్నాయి కనుక వాళ్ళు వచ్చి ఎప్పటికప్పుడు నా కోసం సమాచారాలు కూడా తీసుకుంటుంటారు. ప్రజల కోసం పోరాడి చివరకు నాకు సెంటు భూమి గానీ లేకుండా ఉంది నా భర్తను కూడా పోలీసులు కాల్చి చంపారు .. భూస్వాముల నుంచి జరుగుతున్న అరాచకాలు చూడలేక బొడ్డపాడు పలాస నుండి ఎక్కువగా ఈ ప్రాంత ప్రజలు ఉద్యమంలోకి ఎక్కువగా వెళ్లారు ఎంతోమంది పోలీస్ కాలపుల్లో మృతి చెందారు .ఆ తర్వాత ఉద్యమం నుంచి బయటకు వచ్చి నా పిల్లల్ని పోషించుకుంటూ బ్రతుకుతున్నానని మాజీ దళం ఈశ్వరమ్మ చెప్పారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *