సిరా న్యూస్,రంగారెడ్డి;
హిమాయత్ సాగర్ జలాశయం లో భారీ కొండ చిలువ కలకలం రేపింది. జలాశయం క్రస్ట్ గేటు వద్ద కొండచిలువ ఇరుక్కుంది. నరక యాతన అనుభవిస్తున్న కొండ చిలువను జల మండలి సిబ్బంది గుర్తించారు. స్నేక్ సొసైటీ సభ్యులకు సమాచారం అందించారు స్నేక్ సొసైటీ సభ్యులువచ్చి క్రస్ట్ గేటు వద్ద ఇరుకున్న కొండ చిలువ ను కాపాడారు. దైర్యం గా క్రస్ట్ గేటు వద్ద కు దిగి. పాము నోటిని పట్టుకొని తాడు సహాయం తో మీదకు వచ్చారు. తరువాత అనంతరం భారీ కొండ చిలువను జూ అధికారులకు అప్పగించారు. భారీ వర్షాలకు హిమాయత్ సాగర్ జలాశయం కు కొట్టుకు వచ్చినట్లు అనుమానిస్తున్నారు.