వ‌య‌నాడ్‌లో ప్రియాంకపై పోటీచేసే నవ్య హరిదాస్

సిరా న్యూస్,తిరువనంతపురం;
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ గత లోక్ సభ ఎన్నికల్లో వయనాడ్, రాయ్ బరేలి నియోజకవర్గాల నుంచి పోటీచేసి విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే, కేరళ రాష్ట్రంలోని వయనాడ్ పార్లమెంట్ స్థానానికి రాహుల్ గాంధీ రాజీనామా చేశారు. దీంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. కేంద్ర ఎన్నికల సంఘం ఉప ఎన్నికలకు సంబంధించి ఇటీవల షెడ్యూల్ విడుదల చేసింది. నవంబర్ 13వ తేదీన వయనాడ్ ఉప ఎన్నిక జరగనుంది. ఈ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా రాహుల్ గాంధీ సోదరి, కాంగ్రెస్ మహిళా నేత ప్రియాంక గాంధీ వాద్రా పోటీ చేయనున్నారు. అయితే, బీజేపీ అధిష్టానం ప్రియాంక గాంధీపై పోటీకి నవ్య హరిదాస్ (39)ను బరిలోకి దింపేందుకు నిర్ణయించింది. దీంతో ఇప్పుడు అందరి దృష్టి నవ్య హరిదాస్ పై పడింది. ప్రియాంక గాంధీని ఎదుర్కొనే సత్తా నవ్య హరిదాస్ ఉందా..? ఇంతకీ ఆమె ఎవరు.. ఆమె రాజకీయ ప్రస్థానం ఏమిటి అనే విషయాలపై చర్చ జరుగుతుంది.నవ్య హరిదాస్ వృత్తిరిత్యా సాప్ట్ వేర్ ఇంజనీర్. ఆమెకు 39 సంవత్సరాలు. రాజకీయాలపై ఆసక్తి ఉండటంతో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. అయితే, కొద్దికాలంలోనే బీజేపీలో ఆమె తనదైన ముద్ర వేసుకున్నారు. దీంతో అధిష్టానం దృష్టిని ఆకర్షించారు. ఆమె భర్త పేరు శోభిన్ శ్యామ్. నవ్య 2007లో కాలికట్ యూనివర్శిటీలో కేఎంసీటీ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ పూర్తి చేసింది. ఆ తరువాత మెకానికల్ ఇంజనీర్ గా కొద్దిరోజులు ఉద్యోగం చేశారు. రాజకీయాలపై ఆసక్తితో ఆమె బీజేపీలో కి ఎంట్రీ ఇచ్చింది. కోజికోడ్ కార్పొరేషన్ లో రెండు సార్లు కౌన్సిలర్ గా నవ్య హరిదాస్ పనిచేశారు.బీజేపీలో మహిళా మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగానూ నవ్య హరిదాస్ పనిచేశారు. 2021లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థిగా కొజికోడ్ దక్షిణ నియోజకవర్గం నుంచి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థిపై ఓటమి పాలయ్యారు. ఆ ఎన్నికల్లో 24,873 ఓట్లు సాధించి మూడో స్థానంలో నిలిచారు. నవ్యకు రూ. 1,29,56,264 విలువైన ఆస్తులు ఉన్నాయని, మొత్తం రూ. 1,64,978 అప్పులు ఉన్నాయని ఏడీఆర్ తెలిపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *