EX ministers Jogu Ramanna: బేల‌లో సీఎం దిష్టిబొమ్మ ద‌హ‌నం : మాజీ మంత్రివర్యులు జోగు రామన్న

సిరాన్యూస్‌, బేల
బేల‌లో సీఎం దిష్టిబొమ్మ ద‌హ‌నం : మాజీ మంత్రివర్యులు జోగు రామన్న

ఖరీఫ్ పంటలపై రైతులు ఎంతగానో ఎదురుచూస్తున్న, రైతులకు ఇవ్వాల్సిన వర్షాకాల రైతుభరోసా ను ఎగగొట్టిన ఫై రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపులో భాగంగా ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేప‌ట్టారు. ఇందులో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వ తీరును నిరసిస్తూ మాజీ మంత్రివర్యులు జోగు రామన్న ఆధ్వర్యంలో ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని జాతీయ రహదారిపై బి ఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు రైతులతో కలిసి నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు .సీఎం రేవంత్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, దిష్టిబొమ్మలను ద‌హనం చేశారు.ఈ సంద‌ర్బంగా మాజీ మంత్రి జోగురామ‌న్న మాట్లాడుతూ ఎకరానికి 15 వేల రైతు భరోసా ఇస్తామని చెప్పి రైతులను మోసం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గ్రామ గ్రామాల్లో అడ్డుకుంటామని హెచ్చరించారు. ప్రజలకి ఈచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలం అయిందన్నారు.రైతు భరోసా పేరుతో రైతులకు తీరని అన్యాయం ఈ ప్రభుత్వం చేసిందన్నారు. కార్యక్రమంలో మాజీ గ్రంథాలయ చైర్మన్ రావు, మనోహర్, మాజీ ఎంపీపీ వనిత గంభీర్ ఠాక్రే, మాజీ జడ్పిటిసి అక్షిత సతీష్ పవార్, మాజీ బి.ఆర్.ఎస్ ప్రెసిడెంట్ దేవన్న, ప్రమోద్ రెడ్డి, జక్కుల మధుకర్, తేజ రావు మస్కే, నితిన్ కోడే, దత్తు,కిష్టు, గొడే మధుకర్,అరుణ్, తన్వీర్ ఖాన్, మంగేష్ థాక్రే,బాలచందర్, తానాజీ,సుదర్శన్, తదితర డి ఆర్ ఎస్ నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *