Dr. Lavanya: మండల పశువైద్యాధికారిగా డా. లావణ్య

సిరాన్యూస్, త‌ల‌మ‌డుగు
మండల పశువైద్యాధికారిగా డా. లావణ్య

ఆదిలాబాద్ జిల్లా త‌ల‌మ‌డుగు మండల పశువైద్యాధికారిగా డా. లావణ్య సోమవారం బాధ్యతలు చేపట్టారు. మండలంలోని కుచులాపూర్ గ్రామానికి చెందిన మేకల సదాశివ్ రమ దంపతుల కూతురు లావణ్య ఇటీవల విడుదలైన పశు వైద్యాధికారి పరీక్షా ఫలితాల్లో పశువైద్యాధికారిగా ఎంపికైంది. ఈసంద‌ర్బంగా మండల పశువైద్యాధికారిగా బాధ్యతలు చేపట్టిన లావణ్యను పలువురు అభినందించారు..గతంలో పనిచేసిన పశువైద్యాధికారి దూదూరం రాథోడ్ తో పాటు.. నూతనంగా మండలానికి విచ్చేసిన డాక్టర్ లావణ్యను పలువురు శాలువాలతో సత్కరించి అభినందించారు. కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి గోక గణేష్ రెడ్డి, తహసీల్దార్ రాజ్ మోహన్, మండల విద్యాశాఖ అధికారి వెంకట్ రావ్, బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు రవికాంత్ యాదవ్, మాజీ ఎంపీటీసీలు రమేష్ రెడ్డి, వెంకటి యాదవ్, గ్రామస్తులు కాటిపేల్లి శ్రీనివాస్ రెడ్డి, రామ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *