Bela: బేల‌లో ఘనంగా కొమరం భీమ్, కుంరం సూరుల వర్ధంతి

సిరాన్యూస్, బేల‌
బేల‌లో ఘనంగా కొమరం భీమ్, కుంరం సూరుల వర్ధంతి

ప్రభుత్వాలు ఎన్ని వచ్చిన ఆదివాసుల హక్కులను అమలు పర్చుట లేదని,రాజ్యాంగం అదివాసులకు కల్పించిన హక్కులను కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వర్యం చేస్తుందని ఆదివాసి సంఘాల నాయకులు ఆరోపించారు. కొమరం భీమ్ 84 వర్ధంతి, కుంరాం సూరు 27 వర్ధంతి కార్యక్రమాన్ని బేలా మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముందుగా కొమరం భీమ్ కాలని నుండి మండల కేంద్రంలో ర్యాలి నిర్వహించారు. డీజే పాటలతో నృత్యాలు చేస్తూ ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం కొమరం భీమ్ విగ్రహానికి సాంప్రదాయ బద్దంగా పూజలు నిర్వహించి జెండా ఆవిష్కరణ చేశారు.అనంతరం కొమరం భీమ్ విగ్రహానికి పూల మాల వేసి నివాళ్ళు అర్పించారు.ఇటు కుంరం సురు చిత్ర పటానికి పూజలు చేసి సాంప్రదాయ బద్దంగా పూజలు చేసి నివాళ్ళ అర్పించారు.ఈ సందర్భంగా సందర్భంగా రాయ్ సెంటర్ మండల అధ్యక్షుడు కోరాంగే సోనేరావ్ మాట్లాడుతూ ఆదివాసులు కోసం తన ప్రాణ త్యాగం చేసిన కోమరం భీమ్ ను స్మరించుకుంటూ మండల కేంద్రంలో కొమరం భీమ్, కుంరం సూరు వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించడం జర్గిందని,రాజ్యంగం ప్రకారం ఆదివాసులకు కల్పిస్తున్న చట్టాలని పకర్బందిగా అమలు చేయాలని కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసులకు కల్పించాలని అన్నారు. సందర్బంగా జిల్లా కోలాం హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు మాడావి గోవింద్ రావ్ మాట్లాడుతూ ఆదివాసులకు కల్పిస్తున్న చట్టాలను కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు కాలరాస్తున్నాయని ఏదైతే రాజ్యాంగం ప్రకారం ఆదివాసులకు కల్పించాల్సిన హక్కులు ఎక్కడ అమలు కావడం లేదని మండిపడ్డారు. పిసా చట్టం గాని,1/70 చట్టాలు ఎక్కడ అమలు కావడం లేదని, ఈరోజు కూడా గిరిజన గ్రామాలకు వెళ్ళ డానికి రహదారులు లేవని వెంటనే ప్రభుత్వాలు ఆదివాసులకు కల్పించాల్సిన చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో 9తెగల ఆదివాసి సంఘాల నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *