సిరా న్యూస్,హైదరాబాద్;
గార్బేజ్ వాల్నారేబుల్ పాయింట్( జి వి పి) ఫ్రీ సర్కిల్ గా కృషి చేయాలని అధికారులను కమిషనర్ ఇలాంబరితి ఆదేశించారు. కే బి అర్ పార్కు, రోడ్డు నంబర్35, శ్రీరామ్ నగర్, యూసుఫ్ గూడా సర్కిల్ లో జోనల్ కమీషనర్ అనురాగ్ జయంతి తో కలిసి శానిటేషన్ పని తీరు పై ఆకస్మికంగా తనిఖీ చేసారు. జి వి పి రహిత సర్కిల్ గా తీర్చి దిద్దేందుకు ముందు స్వచ్చ ఆటోల చే 100 శాతం కాలనిలో ఇంటింటి కి చెత్త సేకరణ చేయాలని కమిషనర్ ఏ ఏం అండ్ హెచ్ ఓ ను ఆదేశించారు. . శానిటేషన్ పై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. యూసుఫ్ గూడా యస్ సిటి పి పరిశీలించి రోజు వారీగాఎప్పటి కప్పుడు చెత్త లేకుండా రోజు కు సుమారు 25 టన్నుల కేపాసిటి వాహనాలను పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని నిర్వాహకులను ఆదేశించారు. కమిషనర్ వెంట ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ అనురాగ్ జయంతి. సహాయ వైద్య అధికారి భార్గవ్ నారాయణ తదితరులు ఉన్నారు. శ్రీరామ్ నగర్ బస్తీ, రోడ్డు నంబర్ 35 జి వి పి లను సకాలంలో ఎత్తి వేయడం తో ప్రతి రోజు కూడా ఇదే మయానికి ఎత్తి వేసే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కమిషనర్ కే బి అర్ పార్కు వద్ద విద్యుత్ దీపాల ఆన్ ఆఫ్ స్విచ్ పనులను పరిశీలించారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా వీడి దీపాలు రాత్రి సమయంలో వెలుగే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.