సిరాన్యూస్, ఆదిలాబాద్
ఈనెల 24న కేటీఆర్ సభను విజయవంతం చేయండి : మాజీ మంత్రి జోగురామన్న
* హైడ్రా ప్రభుత్వాన్ని అడ్డుకోవడం బీఆర్ఎస్ ప్రభుత్వం తోనే సాధ్యం
ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సామాన్య ప్రజానికానికి ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారని మాజీ మంత్రి జోగురామన్న ఆరోపించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈనెల 24 న జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న సభకు హాజరు కానున్న నేపథ్యంలో ఊరు వాడా పార్టీ నేతలు విస్తృతంగా పర్యటిస్తున్నారు. గ్రామాల్లో ప్రత్యేకంగా సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేసి కేటీఆర్ సభ జయప్రదమయ్యేలా ప్రత్యేక దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో పట్టణంలోని ఖుర్షిద్ నగర్ లో ఏర్పాటు చేసిన సన్నాహక సమావేశాల్లో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జోగురామన్న పాల్గొని శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి జోగురామన్న మాట్లాడుతూ… ప్రభుత్వ విధానాలతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపాల్సిన బాధ్యత ప్రధాన ప్రతిపక్షంపై ఉందన్నారు. ఇందులో భాగంగానే కేటీఆర్ జిల్లలో పర్యటించి సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. రైతులకు రుణమాఫీ, రైతు భరోసా వంటి పథకాల విషయంలో ప్రభుత్వం తీరని అన్యాయం చేస్తోందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో కనీస సౌకర్యాలు లేక ప్రజలంతా ఇక్కట్లకు గురవుతున్నారని అన్నారు. అన్నదాతలకు న్యాయం జరిగేంత వరకు వారికి అండగా నిలుస్తామని, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటామని స్పష్టం చేశారు.సమావేశంలో పట్టణఅధ్యక్షులు అజయ్, ఉపాధ్యక్షులు,ఆశ్రాఫ్ జహుర్ భాయ్, సలీం, స్వాగత్, పటేల్, జిలాని, షేజాత్,మోసిన్ తదితరులు పాల్గొన్నారు.