బోరుగడ్డ మౌనిక
గుంటూరు;
బోరుగడ్డ అనిల్ కుమార్ పై అక్రమ కేసులు పెట్టి కావాలనే అరెస్ట్ చేశారని అయన భార్య బోరుగడ్డ మౌనిక ఆవేదన వ్యక్తం చేశారు. గుంటూరు నగరంలోని రాజేందర్ నగర్ లో గల బోరుగడ్డ మౌనిక నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు.
వాలనే పోలీసులు నా భర్త అనిల్ కుమార్ పైన తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేశారని అన్నారు. పవన్ కళ్యాణ్ గురించి వారి పిల్లల గురించి బోరుగడ్డ అనిల్ కుమార్ అసభ్యకరంగా మాట్లాడాడని సోషల్ మీడియాలో ఫేక్ వీడియోలు వచ్చేయని తెలియజేశారు. గతంలోని ఈ సంగతిపై బోరుగడ్డ అనిల్ కుమార్ ఓ ప్రముఖ చానల్లో వివరణ ఇవ్వటం జరిగిందని తెలియజేశారు. బోరుగడ్డ అనిల్ కుమార్ కు ఏదైనా జరగరానిది జరిగితే పూర్తిగా పోలీసులదే బాధ్యతని అన్నారు. నాకు న్యాయం జరిగేంతవరకు పోరాటం చేస్తూనే ఉంటానని తెలియజేశారు..