నిలిచిపోయిన రాకపోకలు
సిరా న్యూస్,ఎన్టీఆర్ జిల్లా;
గంపలగూడెం మండలం వినగడప కట్టలేరు వాగుపై వరద ప్రవాహం ఎక్కువయింది. డైవర్షన్ రహదారిపై టిప్పర్ లారీ నిలిచిపోయింది. దాంతో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. గంపలగూడెం మండలం వినగడప వద్ద కట్టెలేరు వాగుపై వరదనీరు ఉదృతంగా ప్రవహిస్తుంది. ఎగువున తెలంగాణ ప్రాంతంలో కురిసిన భారీ వర్షాల కారణంగా తోటమూల- వినగడప మధ్య ఉన్న వంతెనపై వరద నీరు పోటెత్తింది. కట్లేరు వద్ద ధ్వంసమైన వంతెన ప్రక్కన నిర్మించిన తాత్కాలిక రహదారిపై లోడుతో వెళ్తున్న టిప్పర్ లారీ వరద నీటిలో ఇరుక్కుపోయింది._ దీంతో సమీప 20 గ్రామాలకు రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి