సిరా న్యూస్,గుడివాడ;
గుడివాడలో మాజీ మంత్రి కొడాలి నాని పుట్టిన రోజు వేడుకల ఫ్లెక్సీ ఏర్పాటును పోలీసులు అడ్డుకున్నారు. మంగళవారం జరగాల్సిన కొడాలి నాని పుట్టిన రోజు వేడుకలకు పోలీసులు అనుమతి నిరాకరించారు. వైసీపీ నేతలకు ముందస్తు హెచ్చరికలు జారీ చేసారు. గుడివాడ పేద ఎరుకపాడులో కొడాలి నాని ఫ్లెక్సీల ఏర్పాటును అడ్డుకున్నారు.