సిరాన్యూస్, బేల
కళ్యాణలక్ష్మీ చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే పాయల్ శంకర్
కళ్యాణలక్ష్మీ చెక్కుల విషయంలో అధికారుల పేర్లు చెప్పి కొంత మంది డబ్బులు వసూలు చేస్తున్నారని, అలాంటి వారిని నమ్మొద్దని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. మంగళవారం ఆదిలాబాద్ జిల్లా బేల ఎంపీడీవో కార్యాలయంలో 29 లబ్ధిదారులకు ఎమ్మెల్యే పాయల్ శంకర్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇందులో మధ్యవర్తులు దళారులను ప్రోత్సహించవద్దని, ఎక్కడైనా సమస్య వచ్చిన వెంటనే ఫోన్ చేయాలని దళారుల బెడత తగ్గించాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో బేల మండల బీజేపీ అధ్యక్షుడు దత్తనికం, ప్రధాన కార్యదర్శి గణేష్ బోనగిరి వార్, బీజేపీ సీనియర్ నాయకులు మోరేశ్వర్, మాజీ సర్పంచ్ సంఘాల అధ్యక్షులు వట్టిపల్లి ఇంద్రసేకర్, శివ కుమార్,సందీప్, నారాయణ,రాము, శ్రీకాంత్, పొత రాజు నవీన్, మహేష్ ,రాకేష్ తదితరులు పాల్గొన్నారు.