సిరా న్యూస్, గుడిహత్నూర్:
ఉదారత చాటిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్
+ డోంగర్గావ్ అగ్నిప్రమాద బాదిత కుటుంబానికి పరామర్శ
+ రూ. 50వేల ఆర్థిక సహాయం అందజేత
అదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలంలోని డోంగర్గావ్లో గురువారం జరిగిన అగ్నిప్రమాదంలో అన్నీ కోల్పోయి రోడ్డున పడ్డ గ్రామానికి చెందిన దోమకొండ సుధాకర్ కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అండగా నిలిచారు. స్థానిక నాయకులతో కలిసి శుక్రవారం గుడిహత్నూర్ చేరుకున్న ఎమ్మెల్యే, బాదిత కుటుంబ సభ్యులను పరామర్శించి, ధైర్యం చెప్పారు. తక్షణ ఆర్థిక సహాయంగా రూ. 50వేల ఆర్థిక సహాయం అందించి ఉదారత చాటుకున్నారు. అనంతరం స్థానిక తహాసీల్దార్కు ఫోన్ చేసి, ప్రభుత్వం నుంచి అవసరమైన ఆర్థిక సహాయం అందించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కాగా గ్రామ ఉపసర్పంచ్ తాహిర్ సైతం తన వంతుగా రూ. 5వేల ఆర్థిక సహాయం అందించారు.