సిరాన్యూస్, ఓదెల
నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయం : ఎమ్మెల్యే విజయరమణ రావు
* హై లెవెల్ వంతెన నిర్మాణ స్థల పరిశీలన
నియోజక వర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పర్చడమే తన ప్రధాన ధ్యేయమని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు అన్నారు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని రూపునారాయణపేట గ్రామంలో నూతనంగా హై లెవెల్ వంతెన నిర్మాణం కోసం ప్రభుత్వం నుండి 80 కోట్ల రూపాయలను మంజూరు చేయడంతో బ్రిజ్ నిర్మాణం కోసం కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామస్తులు, సంబంధింత అధికారులతో కలిసి స్థలాన్ని పరిశీలించారు. అనంతరం గుంపుల గ్రామంలో అప్రోచ్మెంట్ బ్రిజ్ రోడ్డు గుంపుల నుండి తనుగుల, విలాసాగరం , జమ్మికుంట వెళ్లే రహదారి పూర్తిగా ధ్వంసం కావడంతో కాంట్రాక్టర్లతోసంబంధిత శాఖ అధికారులతో కలిసి రోడ్డు ను పర్యవేక్షించి భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గుంపుల అప్రోచ్మెంట్ రోడ్డు బ్రిజ్ నిర్మాణం ద్వారా ఓదెల, శ్రీరాంపూర్ మండలాలకు ముఖ ద్వారం ఉండే రోడ్డు ధ్వంసం కావడం వల్ల ప్రజలు రాకపోకలకు ఇబ్బందులు పడుతుందటంతో దాన్ని దృష్టిలో ఉంచుకొని రోడ్డు పనులు ప్రారంభించుకోవడం జరుగుతుందని తెలిపారు. సంబంధిత కాంట్రాక్టుర్ కూడా త్వరలోనే రోడ్డు పనులు పూర్తి చేస్తానని ఏఈ సమక్షంలోనే చెప్పడం జరిగింది. కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు, సింగిల్ విండో చైర్మన్ మాజీ ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.