Adivasi Welfare Parishad Ude Shankar: ఏజెన్సీ చట్టాల‌కు లోబడి పని చేయాలి : ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆడే శంకర్

సిరాన్యూస్‌, బేల‌
ఏజెన్సీ చట్టాల‌కు లోబడి పని చేయాలి : ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆడే శంకర్

ఏజెన్సీ చట్టాల‌కు లోబడి పని చేయాలని ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆడే శంకర్ అన్నారు.బుధ‌వారం ఆదిలాబాద్ జిల్లా బేల మండల కేంద్రంలోని ఆదివాసీ సంక్షేమ పరిషత్ ,ఆదివాసీ తొమ్మిది తెగల ఆధ్వర్యంలోతహసీల్దార్, ఎంపీడీఓ కార్యాలయంలో అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్బంగా ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆడే శంకర్ మాట్లాడారు. భారత రాజ్యాంగాన్ని అనుసరించి రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్ ని అమలు పర్చాలని కోరడం జరిగింది అని అన్నారు.గిరిజన గ్రామాల్లో 29 శాఖ లకు సంబందించిన అధికారులు గిరిజన చట్టలకు లోబడి పని చేయాలనీ పేర్కొన్నారు.పిసా 1/70 చట్టం ప్రకారం తేదీ 3-2-1970 తరవాత గిరిజన గ్రామాల్లో గిరిజనేతరులకు స్థిర నివాసం, ఇండ్ల నిర్మాణాలు, వ్యాపారం తో పాటు ఎలాంటి కార్యకలాపాలకు అనుమతి లేదని అన్నారు. మండల కేంద్రంలోని భూరాన్ పూర్ శివరాం 29/ఏ సర్వే కు సంబందించి ఇప్పటి వరకు ఉన్నత అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని రాబోయే రోజుల్లో చర్యలు తీసుకోని యెడల ఉద్యమాని ఉదృతం చేస్తాం అని అధికారులకు హెచ్చరించారు. కార్యక్రమంలో ఆదివాసీ సంక్షేమ పరిషత్ మండల అధ్యక్షులు సిడం నంద కుమార్, రాయి సెంటర్ అధ్యక్షులు కోరంగే సోనేరావ్, ఆదివాసీ అనుబంధ సంఘాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *