సిరా న్యూస్,సంగారెడ్డి;
వీధి కుక్కల దాడిలో 12 గొర్లు మృత్యువాత పడిన ఘటన సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల గ్రామంలో చోటుచేసుకుంది. గుమ్మడిదల గ్రామానికి చెందిన తూపతికృష్ణ గొర్లకోటంపై మంగళవారం అర్ధరాత్రి సమయంలో వీధికుక్కలు తీవ్రంగా దాడి చేశాయి. 12 గొర్రెలు మృత్యువాత పడగా..మరికొన్ని గోర్లకు తీవ్రంగా గాయాలయ్యాయి. సుమారు 2లక్షల వరకు నష్టం వాటిల్లింది. గతంలోనూ ఇలాంటి సంఘటనలు అనేకం చోటు చేసుకున్న వీధి కుక్కలను అరికట్టడంలో అధికారులు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు . ఇప్పటికైనా ప్రభుత్వం అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులు స్పందించి..నష్టపోయిన తూపతి కృష్ణకు న్యాయం చెయ్యాలని..అలాగే వీధి కుక్కలను అరికట్టాలని బాధితులు కోరుతున్నారు.