సిరా న్యూస్,పులివెందుల;
వైఎస్ఆర్ జిల్లా పులివెందుల సమీపంలో ఆర్టీసీ బస్సు అదుపుతప్పి లోయలో పడింది. ఈ ప్రమాదంలో 20 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం పులివెందుల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పల్లె వెలుగు ఆర్టీసీ బస్సు కదిరి నుంచి పులివెందులకు వెళ్తుండగా ఘటన చోటు చేసుకుంది. ఎదురుగా వస్తున్న వాహనాలను తప్పించబోయి 30 అడుగుల లోయలో పడింది.