సిరాన్యూస్, సామర్లకోట
సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయండి
* పెద్దాపురం బీజేపీ నియోజకవర్గ ఇన్చార్జి గోరకపూడి చిన్నయ్య దొర
భారతీయ జనతా పార్టీ క్రియాశీల సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పెద్దాపురం భారతీయ జనతా పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి గోరకపూడి చిన్నయ్య దొర అన్నారు. బుదవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కట్టమూరు గ్రామంలో గురువారం నిర్వహించే సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. పార్టీ క్రియాశీల సభ్యత్వాల నమోదును ఈనెల 30 వరకు పొడిగించినందున పార్టీలో సభ్యత్వం తీసుకోవడానికి ప్రజలకు మరో అవకాశం దక్కిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజలు సభ్యత్వ నమోదును చేసుకొని పార్టీలో భాగస్వామ్యులు కావాలని కోరారు. సమావేశంలో బీజేపీ నాయకులు పాల్గొన్నారు.