సిరాన్యూస్,ఓదెల
మీసేవ ఫెడరేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా బండారి రాజకుమార్
తెలంగాణ మీసేవ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీలో పెద్దపెల్లి జిల్లా ఓదెల మండలం పోత్కపల్లి వ్యక్తికి చోటు దక్కింది. తెలంగాణ మీసేవ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీలో బండారి రాజ్ కుమార్ ను రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా నియమించినట్లు రాష్ట్ర అధ్యక్షులు బైరశంకర్ ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాదులో జరిగిన మీసేవ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ సమావేశంలో రాష్ట్ర కమిటీని నియమించారు. రాష్ట్రవ్యాప్తంగా మీసేవ నిర్వాహకులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ఈ ఎస్ డి కి వినతి పత్రం సమర్పించినట్లు తెలిపారు. రాష్ట్ర కమిటీ లో ఓదెల మండలానికి ప్రాధాన్యత సంతరించుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా మీసేవ ఆపరేటర్లు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి తమ వంతుగా కృషి చేస్తామని రాజ్ కుమార్ తెలిపారు.ఈ నియామకానికి సహకరించిన పెద్దపెల్లి జిల్లా మీసేవ నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు.