Vennampally Road: వెన్నంపల్లి రోడ్డుకు ప్రమాదకరంగా మారిన‌ చెట్లు

సిరాన్యూస్, సైదాపూర్:
వెన్నంపల్లి రోడ్డుకు ప్రమాదకరంగా మారిన‌ చెట్లు

వెన్నంపల్లి-సింగపూర్ ఆర్ అండ్ బి రహదారిలో గల మామిడితోట వద్ద రోడ్డుకు అడ్డంగా చెట్లు ప్రమాదకరంగా వ్యాపించాయి. గతంలో సగం వరకు బీటీ రోడ్డు వేసి మిగతా సగం వదిలేశారు. రోడ్డుపైకి చెట్ల కొమ్మలు వ్యాపించడంతో ఈ మార్గంలో ప్రయాణించే వాహనదారులు, ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. తరచూ పలుసార్లు ప్రమాదాలు జరుగుతూ ప్రజలు క్షతగాత్రులుగా మారుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి వెంటనే చెట్లను తొలగించాలని ప్రజలు, వాహనదారులు కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *