సూపర్ పి ఆర్ పి తో మెరుగైన చికిత్సలు

-ఇపియాన్ వ్యవస్థాపకులు డాక్టర్ సుధీర్ ధార
 సిరా న్యూస్,హైదరాబాద్;
వైద్య రంగంలో వస్తున్న నూతన ఆవిష్కరణలతో రోగులకు మెరుగైన చికిత్సలు అందించగలుగుతున్నామని ఇపియాన్ ఆసుపత్రి వ్యవస్థాపకులు, డాక్టర్ సుధీర్ ధర అన్నారు. మోకాలు, ఇతర కీళ్ల నొప్పులతో బాధపడుతున్న వారికి ఎలాంటి శాస్త్ర చికిత్స లేకుండా పిఆర్పి విధానంతో చికిత్సలు అందిస్తున్న తమ ఆసుపత్రి సూపర్ పిఆర్పి విధానాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు చెప్పారు. కీళ్ల వ్యాధులతో బాధపడుతున్న రోగి రక్తాన్నే సేకరించి పి ఆర్ పి విధానంతో అందిస్తున్న చికిత్సలకు ఎంతో ఆదరణ ఉందని అన్నారు. కాగా స్టేజ్ 4 లో ఉన్న రోగులకు గతంలో చికిత్సలు అందించడం కష్టసాధ్యంగా ఉండేదని, సూపర్ పి.ఆర్.పి విధానంతో అలాంటి వారికి కూడా అద్భుతంగా చికిత్సలు అందించవచ్చునని అన్నారు. దేశ, విదేశాలలో తమ శాఖలను విస్తరించేందుకు ప్రత్యేక ప్రాణాలికతో ముందుకు సాగుతున్నట్లు చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *