సిరాన్యూస్,ఆసిఫాబాద్
గుస్సాడి కనకరాజు కు నివాళులర్పించిన కలెక్టర్ వెంకటేష్ దోత్రే
ఆదివాసుల సంస్కృతి, సంప్రదాయాలలో ముఖ్య భాగమైన గుస్సాడి నృత్యాన్ని అభివృద్ధి చేసి మరొక తరానికి అందించిన గొప్ప వ్యక్తి కనకరాజు అని కొమురం భీం – ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే, ఎస్పీ డివి.శ్రీనివాసరావు అన్నారు.శనివారం జైనూర్ మండలం మార్లవాయిలో పద్మశ్రీ గుస్సాడీ కనకరాజు పార్థివ దేహానికి నివాళులు అర్పించి, ప్రగాఢ సానుభూతి వ్యక్తపరిచారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు.కలెక్టర్ మాట్లాడుతూ గుస్సాడీ నృత్య అభివృద్ధిలో కనకరాజు చేసిన కృషికి గాను భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారం అందించిందన్నారు. ఆదివాసుల సంస్కృతి అభివృద్ధిలో ముఖ్యులైన కనకరాజు అంతక్రియలను ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో నిర్వహిస్తునట్టు తెలియజేశారు. అనంతరం ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నిర్వహించిన అంత్యక్రియ కార్యక్రమాలలో పాల్గొన్నారు.