సిరాన్యూస్, ఓదెల
ఎమ్మెల్యేను సన్మానించిన విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు నారాయణ చారి
పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ ఏరియా కళ్యాణ్ నగర్ గోదావరిఖని విశ్వబ్రాహ్మణ మనుమయ సంఘం సభ్యులు శనివారం రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాగూర్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈసందర్బంగా ఉడు కార్వింగ్ మిషన్ పై తయారు చేసిన ఎమ్మెల్యే చిత్రపటాన్ని ఎమ్మెల్యేకు శ్వబ్రాహ్మణ మనుమయ సంఘం అధ్యక్షులు చెన్నోజు నారాయణ చారి బహుకరించారు. అనంతరం ఎమ్మెల్యేను శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చి 75ఏళ్లు గడుస్తున్నా విశ్వానికే కాలజ్ఞానం నేర్పిన పోతులు వీరబ్రహ్మేంద్రస్వామి వారసులమైన తమకు ప్రభుత్వము నుండి సహాయ సహకారాలు అందడం లేదన్నారు.50 సంవత్సరాలు నిండిన ప్రతి విశ్వబ్రాహ్మణునికి పెన్షన్ ఇవ్వాలని కోరారు. అలాగే ప్రత్యేక కార్పోరేషన్ ఏర్పాటు చేసి సబ్సిడీ ద్వారా రుణాలు,పనిముట్లు అందజేయాలని కోరారు. కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ సంఘం ప్రధాన కార్యదర్శి బ్రాహ్మణపల్లి శ్రీనివాస చారి, కోశాధికారి చిలుముల రాధాకృష్ణ, గౌరవ అధ్యక్షులు నాగవెల్లి బ్రహ్మానంద చారి, కటోజు బ్రహ్మచారి, చింతల నరసయ్య, కలవచర్ల రామ్మూర్తి, నగునూరి రాజయ్య, సత్తయ్య, బిమోజుల తిరుపతి, మొగిలోజు కృష్ణమాచారి, మాచనపల్లి కృష్ణ చారి, బండోజు రమేష్, ఏర్రో జు శ్రీనివాసచారి, తదితరులు పాల్గొన్నారు.